హైదరాబాద్: ప్రముఖ నటుడు చలపతిరావు (78) ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు సోషల్ మీడియా ద్వారా భావోద్వేగంతో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఒక నోట్ ను విడుదల చేశారు. మా కుటుంసభ్యుల్లో ఒకరైన చలపతిరావు చనిపోవడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
#NandamuriBalakrishna garu expressed his grief on the sudden demise of Veteran actor #ChalapathiRao garu & deepest sympathies to family members at this hour of grief. pic.twitter.com/Mwc5DS8OlT
— BA Raju's Team (@baraju_SuperHit) December 25, 2022
చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన.
— Jr NTR (@tarak9999) December 25, 2022
కాగా, చలపతిరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు రవిబాబు తెలిపారు. చలపతిరావు కూతురు అమెరికాలో ఉంటుండటంతో ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు చెప్పారు.
1966లో ‘గూడచారి’ అనే సినిమాతో చలపతి రావు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆయన దాదాపుగా 600కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకులను మెప్పించారు. చల్లిపతి రావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రిలో జన్మించారు. రెండు రోజల వ్యవధిలో కైకాల సత్యనారాయణ, చలపతిరావు మృతి చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చలపతి రావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు రవిబాబు దర్శకుడు, నిర్మాతగా ఉన్నాడు.