Monday, December 23, 2024

బీజేపీకి షాకిచ్చిన గాలి జనార్దన్ రెడ్డి… కొత్తపార్టీతో బరిలోకి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి అధికారిక బీజేపీకి షాక్ ఇచ్చారు. కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన సొంత పార్టీని స్థాపించారు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ కల్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీని ఆదివారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.

అక్రమ మైనింగ్ ఆరోపణలపై గాలి జనార్దన్ రెడ్డి జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారు. బెయిల్ ఇచ్చే సమయంలో జనార్దన రెడ్డికి సుప్రీం కోర్టు కొన్ని ఆంక్షలు విధించింది. పాస్‌పోర్టులను అప్పగించాలని , తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు కేసులు , వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనార్దన్ రెడ్డి పార్టీని స్థాపించడంతో కర్ణాటకలో సంచలనంగా మారింది.

పార్టీని ప్రకటించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తన జీవితంలో రాజకీయంగా మరో ఎపిసోడ్ ప్రారంభమైందని, కల్యాణ కర్ణాటక ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే తాను ఇక్కడ ఉన్నట్టు చెప్పారు. స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీలు ప్రజలను విడగొట్టి లబ్ధి పొందాలనుకుంటే ఇక్కడ కుదరదన్నారు. బీజేపీకి చెందిన మంత్రి శ్రీరాములుతో విభేదాలున్నట్టుగావస్తున్న వార్తల పై స్పందిస్తూ శ్రీరాములు తన బాల్యస్నేహితుడని, అతనితో సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News