Saturday, November 16, 2024

రైతుల భూముల్లో ఇండస్ట్రీయల్స్ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదు..

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్: పరిశ్రమల పేరిట రైతుల భూములను లాకుంటే ఊరుకునేది లేదని ఎల్లారెడ్డి మాజి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం అడ్లూర్‌రెడ్డి గ్రామాంలో ఇండస్ట్రీయన్ జోన్ లో భూములు కోల్పోతున్న బాదిత రైతులతో ఆయన సామావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రీయల్ జోన్ కోసం 8 గ్రామాలను చెందిన రైతులు భూములు కోల్పోతున్నారని తెలిపారు.

వ్యవసాయం చేసుకుంటుంన్న పట్టా భూముల్లో ఇండస్ట్రీయల్ జోన్ ఏర్పాటు చేయడం తగదని చెప్పారు. భూములను కాపాడటానికి రైతులతో కలసి పోరాటం చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా బాదిత రైతులు ఆయా గ్రామాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసుకుని భూ పోరాటం కోసం ముందుకు వస్తే వారి తరపున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.

బిజేపి నేత ఎమ్మెల్యే ఈటెల రాజెందర్ తో కలసి రైతుల కోసం ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. వివిద దశల్లో రాష్ట్ర ,కేంద్ర బిజేపి నాయకులను జిల్లాకు తీసుకువస్తానని తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లిన తరువాత పరిశ్కారం కాకపోతే రైతుల తరపున కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. దమ్ముంటే రైతులు భూములు ఇండస్ట్రీయల్ జోన్ వెళ్లకుండా కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే కు సవాలు విసిరారు. తాను పార్టీ మారుతున్నట్లు పుకార్లు వస్తున్నాయని ఇందంతా అసత్య ప్రచారమని అన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News