బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 20212023 పాయింట్లపట్టికలో రెండోస్థానంలో నిలిచింది. ఈ పట్టికలో భారత్ కంటే ముందున్న ఆసీస్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా జట్టు 76.92విజయాల శాతంతో ప్రథమస్థానంలో ఉండగా, భారత్ 58.93శాతం విజయాలతో రెండోస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఖాతాలో 120పాయింట్లు ఉండగా టీమిండియా ఖాతాలో 99పాయింట్లు ఉన్నాయి.
భారత్ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు 54.55పాయింట్లుతో మూడోస్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌కోసం భారత్‌తో పోటీపడుతుంది. సఫారీజట్టు ఖాతాలో 72పాయింట్లు ఉన్నాయి. శ్రీలంక జట్టు 53.33 విజయశాతం 64 పాయింట్లుతో నాలుగోస్థానంలో కొనసాగుతుంది. అయితే, ఇంగ్లాండ్ పాయింట్లపరంగా అన్నిజట్లకంటే ఎక్కువగా పాయింట్లు ఉన్నా విజయశాతం మొదటి నాలుగు జట్లు కంటే తక్కువగా ఉండటంతో ఐదోస్థానంలో నిలిచింది. కాగా భారతజట్టుకు ఆస్ట్రేలియా సిరీస్ కీలకం కానుంది.