- Advertisement -
హైదరాబాద్ : తన అమ్ముమ్మ జ్ఞాపకార్థం పాఠశాల నిర్మించడానికి కామారెడ్డి జిల్లాలోని పోసానిపల్లి గ్రామం (ప్రస్తుతం కోనాపూర్) ను ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆదివారం సందర్శించారు. ఆ గ్రామంలో తమ అమ్మమ్మ పూర్వీకుల ఇంట్లో ఎగువ మానేర్ ప్రాజెక్ట్‌లో 1940లలో గ్రామ భూములు మిగిలిపోయాయన్నారు. అయితే, ఇంటి అవశేషాలు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఆ గ్రామంలో పాఠశాల నిర్మించేందుకు సంకల్పించామని వెల్లడించారు. ఆ గ్రామాన్ని సందర్శించి, అక్కడున్న పరిస్థితిని వివరించే విధంగా ట్వీట్ చేశారు. అంతేకాదు, త్వరలో అక్కడ పాఠశాల నిర్మించనున్నట్లు ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ వెల్లడించారు.
- Advertisement -