Monday, December 23, 2024

భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి… బెడ్‌రూమ్‌లో పాతిపెట్టి..

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు… భార్యను తాడుతో కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని బెడ్ రూమ్‌లో గుంత తీసి పాతిపెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖ్మీపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గోలా గోకరన్ గ్రామంలో మహ్మాద్ వశీ అనే యువకుడు ఉషా శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మార్పించి అనంతరం ఆమెకు అక్సా ఫాతిమా పేరు పేట్టాడు. మహ్మాద్ వశీకి- ఫాతిమాకు గొడవ జరిగింది. బెడ్‌రూమ్‌లో ఆమె నిద్రపోయిన తరువాత ఆమె చేతులు, కాళ్లు కట్టేసి అనంతరం ఆమె కరెంట్ షాక్ ఇచ్చాడు.

ఆమె మృతి చెందిన తరువాత బెడ్ రూమ్‌లో గుంత తీసి పాతి పెట్టాడు. రెండు రోజులు బెడ్‌రూమ్‌లోనే పడుకున్నాడు. రెండు రోజుల తరువాత అతడు ఉంటున్న ఇంటికి తల్లి వచ్చి కోడలు ఎక్కడ అని అడిగింది. అతడి నుంచి జవాబు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మహ్మాద్ వశీ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె పుట్టింటి వారికి పోలీసులు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News