Monday, December 23, 2024

పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు

- Advertisement -
- Advertisement -

నాడు 38 లక్షలు
నేడు 56 లక్షలు
ప్రతి సంవత్సరం 10 నుంచి 15 పెరుగుతున్న కనెక్షన్లు

మన తెలంగాణ/సిటీబ్యూరో : రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం గ్రేటర్ హైదరాబాద్ శర వేగం గా అభివృద్ది చెందుతోంది.జాతీయ, అంతర్జాక పశ్రమలు భారీ ఎత్తున నెలకొల్పుతుండటంతో వాటి విద్యుత్ వినియోగం కూడా అధికంగా అవుతోంది. 2014 అనంతరం ప్రతి సంవత్సరం విద్యుత్ కనెక్షన్లు 10 నుంచి 15 శాతం పెరుగుతున్నాయి. 2014 లో 38 లక్షల 16 వేల 211 విద్యుత్ కనక్షన్లు ఉండగా అవి నేటి కి (2022)56 లక్షల 36 వేల, 444కు పెరిగాయి. విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో దాంతో పాటు విద్యుత్ వినియోగదారులకు మెరుగైన,నాణ్యమైన విద్యుత్‌ను సరసపరా చే సేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉ న్నారు.

అయితే పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉన్నా ప్రాంతాలతో పాటు పనిభారం అధికంగా ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించి అదనంగా కార్యాలయాలను పెంచేందుకు కృషి చేస్తుంది. రాష్ట్ర ఆ విర్భావం అనంతరం ఇప్పటికే సెక్షన్లు, సబ్‌డివిజన్లు, డివిజన్లు, సర్కిళ్ళ సంఖ్యను కూడా పెంచింది. గ్రేటర్ పరిధిలో ఉన్న ఆరు సర్కిళ్ళను 9 సర్కిళ్ళుగా 19 డివిజన్లు 26గా 50 సబ్‌డివిజన్లు 65 కు 150 సెక్షన్లు 192కు పెంచింది. అయినప్పటి పనిభారం పెరగడం తో ప్రస్తుతం సబ్ డివిజన్లు పెంచేందుకు యాజమా న్యం తీవ్రంగా కసరత్తు చేస్తోంది, ప్రస్తుతం గ్రేటర్ హై దరాబాద్ పరిధిలో 9 సర్ళిళ్ళు, 26 డివిజన్లు, 65 సబ్‌డివిజన్లు 192 సెక్షన్లు ఉన్నాయి. వీటికి అదనంగా మ రో 15 నుంచి 20 సెక్షన్లు, పది ,పన్నెండు సబ్‌డిబిజన్లు పెంచే అవకాశం అందని  అధికారులు చెబుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం ఉన్న సర్కిళ్ళలో హబ్సీగూడ, మేడ్చెల్, రాజేంద్రనగర్ ,సైబర్‌సిటీ, సర్కిళ్ళలో విద్యుత్ కనెక్షన్లు వేగంగా పెరుగుతండటంతో ఆయా సర్కిళ్ళపై విద్యుత్ సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 5 సర్కిళ్ళ పరిధిలో అదనపు సెక్షన్లు, డివిజన్లు పెంచేందకు విస్తృతంగా కసరత్తు చేస్తోంది. త్వరో వీటిని ఏర్పాటు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

హబ్సీగూడ, సర్కిల్లో అత్యధిక విద్యుత్ కనెక్షన్లు ఉండగా తర్వత స్థానంలో మేడ్చేల్ సర్కిల్లో ఉన్నాయి. హబ్సీగూడలో 8.33 లక్షలు, మేడ్చెల్‌లోఎ 7.79 లక్షలు, సరూరగ్‌నగర్ సర్కిల్లో 7.11 ల క్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. పరిమితికి మించి విద్యుత్ కనెక్షన్లు ,సబ్‌డివిజన్లు గుర్తించి వాటిని విభజింయి వాటిని కొత్త సబ్‌డివిజన్‌కు కింద ఏర్పాటు చేయనున్నారు. అదనపు సబ్‌డివిజన్ల ఏర్పాటు కసరత్తు పక్రియ ప్రారంభం కావడంతో కీలకమైన పోస్టుల కోసం కొంత ంది ఏడీఈలు పైరవీలు ప్రారంభింభనున్నట్లు తెలిసింది. సాధారణ బదిలీల్లో ప్రయత్నం చేసే అవకాశం రాని వారు ప్రస్తుతం కీలకమైన పోస్టులు దక్కించేకునేందకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం
గ్రేటర్‌లో 9 సర్కిళ్ళ పరిధిలోని విద్యుత్ కనెక్షన్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ః

సర్కిల్ పేరు విద్యుత్ కనెన్లు ( లక్షల్లో)
రాజేంద్రనగర్ 5,91489
హబ్సీగూడ 820277
సరూర్‌నగర్ 687509
సైబర్‌సిటీ 619313
మేడ్చెల్ 731062
సికింద్రాబాద్ 510173
బంజారాహిల్స్ 386717
సిటీ సౌత్ 687949
సిటీ సెంట్రల్ 601955

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News