Monday, December 23, 2024

నేడు పుంజుకున్న స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: నాలుగు రోజుల వరుస నష్టాలకు నేడు బ్రేక్ పడింది. మదుపరుల బాటమ్ ఫిషింగ్, ఆశావాహ సెంటిమెంట్‌తో స్టాక్ మార్కెట్ తిరిగి పుంజుకుంది. ఉదయం సానుకూలంగా ఆరంభమైన సూచీలు గంటగంటకూ ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 721.30 పాయింట్లు లేక 1.20 శాతం పెరిగి 60566.42 వద్ద, నిఫ్టీ 207.80 పాయింట్లు లేక 1.17 శాతం పెరిగి 18014.60 వద్ద ముగిశాయి. దాదాపు 2787 షేర్లు లాభపడగా, 733 షేర్లు నష్టపోయాయి, 129 షేర్లు ఎలాంటి మార్పు లేకుంగా ముగిశాయి. ఒక విధంగా చెప్పాలంటే బలమైన రికవరీ కనిపించింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందాల్కో, ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్‌కార్పొరేషన్ ప్రధానంగా లాభపడగా, డివీస్ ల్యాబ్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్ ప్రధానంగా నష్టపోయాయి. డాలరుతో రూపాయి విలువను పోల్చినప్పుడు 0.12పైసలు నష్టపోయి రూ. 82.65 వద్ద ట్రేడయింది. 24 క్యారట్ల 10 గ్రా. బంగారం రూ. 46.00 పెరిగి రూ. 54,620.00 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News