- Advertisement -
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) ఎంఎల్‌ఏల కొనుగోలు(పోచ్‌గేట్) కేసును నేడు తెలంగాణ హైకోర్టు కేంద్ర పరిశోధన సంస్థ(సిబిఐ)కు బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసును హైదరాబాద్ కమిషనర్ సివి. ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక పరిశోధన బృందం(సిట్) విచారణ జరుపుతూ వచ్చింది. ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టి కొనుగోలుకు పాల్పడ్డం(పోచింగ్) అన్నది ఒకవిధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని చెప్పుకోవచ్చు. హైకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బిజెపి నాయకుడు, అడ్వొకేట్ రామ్ చందర్ రావు అన్నారు.
- Advertisement -