Monday, December 23, 2024

సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. హత్యే!

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైన హత్య చేశారా? అనే కోణంలో సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటివరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అయితే, తాజాగా సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ అప్పుడు పోస్ట్ మార్టంలో పాల్గొన్న ముంబై కూపర్ హాస్పిటల్ మార్చురీ రూమ్ ఉద్యోగి రూప్ కుమార్ షా సంచలన ఆరోపణలు చేశారు.

”సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు.. అదే సమయంలో పోస్ట్‌మార్టం కోసం కూపర్ హాస్పిటల్‌కు ఐదు మృతదేహాలు వచ్చాయి. మేము పోస్ట్ మార్టం చేయడానికి వెళ్ళినప్పుడు సుశాంత్ సింగ్ ను గుర్తుపట్టాం. అతని శరీరంపై పలు గుర్తులు ఉన్నాయి. అప్పుడే సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్య అని ఉన్నతాధికారులను చెప్పాం. కానీ వారు ఆ విషయాన్ని చెప్పకుండా నిబంధనల ప్రకారం పని చేయమన్నారు. పోస్ట్‌మార్టం చేసినప్పుడు రికార్డ్ చేయకుండా.. మృతదేహానికి సంబంధించిన ఫోటోలను మాత్రమే తీయాలని అదేశించారు. దీంతో వారి ఆదేశానుసారం అలా చేశాం” అంటూ రూప్ కుమార్ షా చెప్పుకొచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News