- Advertisement -
న్యూఢిల్లీ: మదర్ డెయిరీ తమ పాల ధరను లీటరుకు రెండు రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చులు పెరగడంతో పాల ధరలను పెంచుతున్నట్లు మదర్ డెయిరి తెలిపింది. ఈ ఏడాది మదర్ డెయిరీ పాల ధరలను పెంచడం ఇది ఐదోసారి.
ఢిల్లీ ఎన్‌సిఆర్ మార్కెట్‌లో లీడింగ్ పాల సరఫరాదారుగా ఉన్న మదర్ డెయిరీ 30లక్షల పాలును సరఫరా చేస్తోంది. లీటర్‌కు రూ.2 పెంచడంతో క్రీమ్ పాల ధర లీటరు రూ.66కి పెరిగింది. టోన్డ్ పాల ధర లీటరుకు రూ.51 నుంచి రూ.53కి పెరిగింది. అదేవిధంగా డబుల్ టోన్డ్ పాల ధర నుంచి రూ.47కి పెరిగింది. అయితే ఆవు పాల ధరలను పెంచకపోవడంతో వాటి ధరలు యథాతథంగా ఉన్నాయి. పాల ధరల పెంపుతో కుటుంబ బడ్జెట్ పెరగనుంది.
- Advertisement -