Saturday, January 18, 2025

మద్దతు ధర లేక చెట్టు దిగని తెల్లబంగారం

- Advertisement -
- Advertisement -

కాసిపేటః ఒక వైపు ప్రభుత్వం ఖరీఫ్‌లో ఆహార పంటలు వేయాలని సూచించినప్పటికి కొందరు రైతులు ఆహార పంటలతో పాటు వాణిజ్య పంట ఐన పత్తిని కూడా వేసారు. పత్తి పంట సాగు ఆశాజనకంగానే వున్నప్పటికి ఇంకా తెల్లబంగారం మాత్రం చెట్టు మీదనే వుండి పోయింది. కాసిపేట మండలంలో తెల్లబంగారం చెట్ల మీదనే వెరసి పోతుంది. పత్తి పంటకు మద్దతు ధర మొదటగా పెరిగి మళ్లీ తగ్గడంతో రైతులు మద్దతు ధర లేదనే కారణంగా పత్తిని చెట్లమీదనే ఉంచడంతో గమనార్హం. ఒక వైపు కోనుగోలు కేంద్రాలు లేక పోవడంతో దళారులు తాము చెప్పిన ధరకే ఇవ్వాలని సూచిస్తున్నారే వాదన ఒక వైపు విన వస్తుండగా, మరో వైపు రైతులు మొత్తం పత్తిని ఒకేసారి కూలీల చేత ఏరిపించేందుకు చెట్టు మీదనే మొత్తం పత్తి విరగ బూసే వరకు వేచి చూస్తున్నారనే వాదనలు కూడా వినవస్తున్నాయి.

కాసిపేట మండలంలో కొందరు రైతులు పత్తి పంట వేయడంతో పంట ఆశజనకంగా ఉన్నప్పటి మొదట్లో పత్తి ధర మద్దతుగా ఉన్నప్పటి కొందరు రైతులు ఇంకా ధర పెరుగుతుందనే కారణంగా కొందరు రైతులు పత్తిని చెట్ల మీదనే ఏరకుండా ఉంచగా, కొందరు రైతులు ఏరినప్పటికి ఇంట్లో నిలువ ఉంచారు. ప్రస్తుతం పత్తి ధర తగ్గడంతో రైతులు విల విలాలాడుతున్నారు. వ్యవసాయం చేసే సమయంలో పెట్టు బడులు అప్పులు చేసి పెట్టామని, పత్తికి ప్రస్తుతం ధర తగ్గడంతో ఎటు పాలుపోని పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. ప్రకృతిలో ఏమైన అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే పరిస్థితులు మారిపోతాయని పలువురు పేర్కోంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News