Monday, December 23, 2024

ఐసిఐసిఐ రుణం మోసం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్ రుణం మోసం కేసులో వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సోమవారం అరెస్టు చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ, ఎండి చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను శుక్రవారం ఏజెన్సీ అరెస్టు చేసింది. దీని తరువాత ముంబై ప్రత్యేక కోర్టు దూత్‌ను మూడు రోజుల కస్టడీకి పంపింది.

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసిఐసిఐ బ్యాంక్‌లో కీలక బాధ్యతలు చేపడుతున్న చందా కొచ్చర్ ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని, వీడియోకాన్‌కు చెందిన వివిధ కంపెనీలకు కొన్ని రుణాలు మంజూరు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2012లో దేశీయ రుణ రీఫైనాన్సింగ్ కింద మంజూరైన రూ. 1,730 కోట్ల రుణానికి సంబంధించి వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన ఆరు ఖాతాల ప్రస్తుత బ్యాలెన్స్‌ను సర్దుబాటు చేశారు. అదే సమయంలో 2012లో మంజూరు చేసిన రూ.3,250 కోట్ల రుణంలో రూ.2,810 కోట్లు (సుమారు 86%) తిరిగి చెల్లించలేదని సిబిఐ కూడా తెలిపింది. వీడియోకాన్, దాని గ్రూప్ కంపెనీల ఖాతాలు జూన్ 2017లో ఎన్‌పిఎలుగా ప్రకటించారు. ఎన్ పిఎ డిక్లరేషన్ కారణంగా బ్యాంకు నష్టపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News