న్యూఢిల్లీ: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. బుధవారం ఉదయం అస్వస్థతతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మహెతా ఇన్‌స్టిట్యూట్ ఆఆఫ్ కార్డియాలజీ అండ్ రిసెర్చ్ సెంటర్‌లో 99 సంవత్సరాల హీరాబెన్ చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి ఒక బులెటిన్‌లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీకి సందేశం పంపారు. తల్లీ కుమారెడి మధ్య ప్రేమ అమూల్యమైనదని ఈ క్లిష్ట సమయంలో తన ప్రేమ, మద్దతు మీకు ఉంటాయని ప్రధాని మోడీకి రాహుల్ ధైర్యం చెప్పారు. మీ తల్లిగారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.
ఇలా ఉండగా, అహ్మదాబాద్‌లో హీరాబెన్ మోడీ చికిత్స పొందుతున్న ఆసుపత్రిని బిజెపి గుజరాత్ అధ్యక్షుడు సిఆర్ పాటిల్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ కూమా ఆసుపత్రికి చేరుకున్నారు. గాంధీనగర్ జిల్లాలోని రైసన్‌లో తన చిన్న కుమారుడు పంకజ్ మోడీతో కలసి హీరాబెన్ నివసిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ ఓలింగ్‌కు ముందు రోజు డిసెంబర్ 4న ప్రధాని మోడీ తన తల్లిగారిని కలుసుకున్నారు.