Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం..

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఎక్స్‌ప్రెస్‌వేలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 35ఏళ్ల మహిళ, ఆమె నాలుగేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో న్యాయవాది అయిన ఆమె భర్త, మరో కుమార్తె తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు.

న్యాయవాది అజయ్‌జోషి తన కుటుంబంతో కలిసి తుల్జాపూర్ నుంచి వెళుతుండగా చక్రం ఊడిపోవడంతో ప్రమాదం సంభవించిందని ఎస్పీ వెల్లడించారు. జోషి భార్య, కుమార్తె సంఘటన ప్రాంతంలోనే ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News