Thursday, December 19, 2024

2023 నాటికి మల్కాపూర్ కొత్త టెర్మినల్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : రూ.3,338 కోట్ల విలువచేసే పారాదీప్ హైదరాబాద్ పైప్‌లైన్ ప్రాజెక్టును అమలు చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి) ఇప్పటికే నల్గొండలోని మల్కాపూర్‌కు కొత్త టెర్మినల్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని బుధవారం మీడియా సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐఒసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.అనిల్ కుమార్ తెలిపారు. ఒడిషాలో పారాదీప్ రిఫైనరీ లింకింగ్ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రంలో ఇంధన సరఫరా సులభతరం అవుతుందని అన్నారు.

ఇనర్ట్ గ్యాస్, స్టోరేజ్ ట్యాంక్, అనుబంధ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ వెల్లడించారు. 180 కిలో లీటర్ల నిల్వ సామర్థంతో మల్కాపూర్‌లో ఐఒసి కొత్త పెట్రోలియం టెర్మినల్ ఏర్పాటు చేస్తోందని, దీని కోసం రూ.611 కోట్లు పెట్టుబడులు పెడుతోందని, ఇది 2023 నాటికి సిద్ధం కానుందని తెలిపారు. దాదాపు 1,212 కి.మీ పారాదీప్‌హైదరాబాద్ పెట్రోలియం ప్రొడక్ట్ పైప్‌లైన్ ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి 2023 ఆగస్టు వరకు సమయం ఉందని, అయితే కొన్ని భద్రతా అంశాల దృష్టి ఇది వచ్చే ఏడాది ఆగస్టు వరకు సమయం తీసుకుంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News