Friday, December 20, 2024

తెలంగాణ కలను ‘రైతుబంధు’ సాకారం చేస్తోంది : ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : యాసంగి రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న 10వ విడత రైతుబంధు నగదును ప్రభుత్వం అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 70 లక్షల మంది అన్నదాతలు రైతుబంధు ద్వారా రూ.7,676.61 కోట్ల సహాయం అందుకుంటారని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో వెల్లడించారు. రైతులు, పేదలు సాధికారత పొందే భారతదేశం గురించి కెసిఆర్ కలలు కన్నారని చెప్పారు.

రైతుబంధు పథకం తెలంగాణ కలను సాకారం చేస్తోందని చెప్పారు. ఈ సీజన్‌లో 70.54 లక్షల మంది రైతులకు చెందిన కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు రూ.7,676.61 కోట్లు విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రైతుబంధు నిధులను బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. రెండు ఎకరాల రైతులకు గురువారం నగదు జమ చేయనుంది. ఇలా రోజుకు ఎకరం పెంచుతూ గతంలో ఇచ్చినట్లుగా జమ చేయనున్నారు. ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి 9 విడుతల్లో రూ.57,882.67 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా పదో విడతతో ఈ మొత్తం రూ.65,559.28 కోట్లకు చేరనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News