Friday, December 20, 2024

ధోనీ గారాలపట్టి జీవాకు మెస్సి అరుదైన గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాకు అర్జెంటీనా సాకర్ స్టార్ లియొనెల్ మెస్సి అరుదైన బహుమతిని అందజేశాడు. ఇటీవల ఖతర్ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా టీమ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు మెస్సి ఆరాధ్య దైవంగా మారాడు. ఇంత ఆదరణ లభిస్తున్నా మెస్సి మాత్రం తన అభిమానులను, ఫాలోవర్లను మాత్రం మరచిపోవడం లేదు. ఇక మెస్సికి భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ధోనీ అంటే ఎంతో అభిమానం. ఈ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్సి తన సంతకంతో కూడిన జెర్సీని ధోనీ గారాలపట్టి జీవాకు పంపించి తన ప్రేమను చాటుకున్నాడు. ఇక మెస్సి నుంచి అందిన జెర్సీని చూసి జీవా భావోద్వేగానికి గురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News