Saturday, December 21, 2024

కెసిఆర్ వంటి నేత ఉంటే ఆంధ్రా ఎప్పుడో బాగుపడేది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం గొప్ప కల్పన మార్గదర్శక శక్తి కలిగిన కెసిఆర్ నలుమూలల బిఆర్‌ఎస్ పార్టీని విస్తరించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా గర్వపడే పరిణామమని ఆంధ్రప్రదేశ్ యూత్ అండ్ స్టూ డెంట్స్ జెఎసి తెలిపింది. బుధవారం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎపి యూత్ అండ్ స్టూడెంట్స్ జెఎసి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ చరిత్రలోనే అబ్ కీ బార్ కిసా న్ సర్కార్ నినాదాన్ని మొదటి నా యకుడు కెసిఆర్ అని కొనియాడారు. సొంతగా జా తీయ పార్టీ స్థాపించి ఢిల్లీ నడుబొడ్డున బిఆర్‌ఎస్ జెం డా ఎగరేయడంతో తెలుగు ప్రజానీకం గుండెలు ఉప్పొంగేలా కెసిఆర్ చేశారని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో భారత దేశానికి దారి చూపించడం కోసం సా హసోపేత అడుగులను కెసిఆర్ వేస్తున్నారని అన్నా రు.

కెసిఆర్ వెంట దేశంలోని అన్ని వర్గాలు కదలాల్సిన చారిత్రక సందర్భం ఆసన్నమైందన్నారు. జా తీయ స్థాయిలో కెసిఆర్ వంటి నేత ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు ఈ దేశమే బాగుపడుతుందని తెలిపారు. అభివృద్ధి, సకలజనుల సంక్షేమం పట్ల కె సిఆర్‌కు ఉన్నంత తపన రవ్వంత ఎపి నాయకులకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడేదని అన్నారు. విభజన తర్వాత రెండు చోట్ల ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్ విశ్వరూపం చూపించారని ప్రశంసించారు. కుల, మత రహితమైన సార్వజనీన ప్రగతి సిద్దాంతంతో పాలనకు నూతన నిర్వచనం రాశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి లక్షలాది ఎకరాలకు నీ రు అందించడంతో  పాటు రైతుబంధు, రైతు బీమా వంచి చారిత్రాత్మక రైతాంగ సంక్షేమ పథకాలను కెసిఆర్ అమలు చేశారని అన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాల ఆలోచన ఆంధ్రా నాయకులకు కలుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నీరు అందుతుందన్నారు.

వెయ్యి గురుకులాలు స్థాపించి లక్షలాదిమంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట కెసిఆర్ వేశారని అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా, టిఎస్ ఐపాస్ లాంటి పథకాలతో వేలాది పరిశ్రమల స్థాపన జరిగిందన్నారు. అద్భుతమైన ఆవిష్కరణల కేంద్రంగా సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ తీర్చిదిద్దబడుతుందని జగదీశ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇద్దరు గోల్‌మాల్ నేతల చేతుల్లో చిక్కి తీవ్రంగా నష్టపోతుందని జెఎసి నేత జగదీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదిన్నర ఏండ్లు గడిచినా కనీసం ఒక పరిపాలన కేంద్రాన్ని నిర్ధారించలేని అసమర్థ నాయకత్వం ఎపిలో ఉందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ గద్దలకు కట్టబడతామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తున్నా వైసిపి, టిడిపి, బిజెపి ఆంధ్రానాయకులు నోరు మెదపడం లేదని విమర్శించారు. కులగజ్జి నాయకుల మాయలో పడి మోసపోవడానికి ఎపి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News