Monday, December 23, 2024

బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

శివమొగ్గ: బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై కర్నాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్ బుక్‌చేశారు. ఇటీవల ఆమె కర్నాటకలో విద్వేష ప్రసంగం చేశారని పోలీసులు గురువారం తెలిపారు. శివమొగ్గలోని కొటే పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. ఆమెపై ఐపిసి సెక్షన్స్ 153(ఎ), 153(బి), 268, 295(ఎ) కింద ఆమెపై కేసులు బుక్‌చేశారు. ఐపిసి సెక్షన్ 298, 504, 508 కింద కూడా ఆమెపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది.

కర్నాటక పోలీసులు ఫిర్యాదుదారు, వెంచర్ క్యాపిటలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు తెహసీన్ పూణేవాలాను కూడా దర్యాప్తులో చేరాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ప్రజ్ఞాసింగ్ ఇటీవల కర్నాటకకు వచ్చినప్పుడు ఆమె దైవదూషణ ప్రసంగంచేసిందని, ముఖ్యంగా మైనారిటీ సముదాయానికి వ్యతిరేకంగా ప్రసంగించిందని పూణేవాలా ఫిర్యాదు దాఖలు చేశారు. ఆయన తన ఫిర్యాదును శివమొగ్గ పోలీస్ సూపరింటెండెంట్(ఎస్‌పి) జికె. మిథున్ కుమార్‌కు సోషల్ మీడియా ద్వారా దాఖలు చేశారు. అంతేకాక అతను ఓ కాపీని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు కూడా పంపారు. కాగా కొటే పోలీస్టేషన్ విచారణకు రావలసిందిగా తమ నోటీసును పూణే వాలాకు ఈమెయిల్ ద్వారా పంపింది.

శివమొగ్గలో ఆదివారం ప్రజ్ఞా ఠాకూర్ ‘హిందూ జాగరణ వేదికకు చెందిన దక్షిణ వార్షికోత్సవ సమావేశం’లో పాల్గొన్నారు. అంతేకాక ఆమె బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష నివాసాన్ని ఆదివారం సందర్శించారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన హర్షను ఈ మధ్య నరికి చంపేశారు.

ఫిర్యాదులో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దైవ దూషణ, మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రసంగించారని పేర్కొన్నారు. ఆమె ‘లవ్ జిహాద్’కు పాల్పడేవారికి తగిన జవాబు ఇవ్వాలని ప్రజలను కోరారని కూడా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News