Monday, December 23, 2024

తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం

- Advertisement -
- Advertisement -

 

 

తిరుపతి: చిత్తూరులోని కెవిఆర్‌ జ్యూవెలర్స్‌ వ్యవస్థాపకులు కెఆర్‌.నారాయణమూర్తి, ఆయన సతీమణి కెఎన్‌.స్వర్ణ గౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఇఒ (ఎఫ్‌ఏసి) అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు అందించారు. దాత అందించిన వివరాల మేరకు సుమారు 1756 గ్రాములు బరువుగల ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు ఉంటుంది. వీటిలో మూలవిరాట్‌ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీమలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి విలువైన రాళ్లు పొదిగిన మూడు పతకాలు ఉన్నాయి. కాగా ఇదే దాత గతేడాది డిసెంబరులో సుమారు రూ.3 కోట్లు విలువైన కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, ఆలయ డెప్యూటీ ఇఒ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News