ముంబై: నేడు స్టాక్ మార్కెట్‌లో స్మార్ట్ రికవరీ కనిపించింది. ఎఫ్ అండ్ ఓ(F&O) ఎక్స్‌పైరీ రోజైన నేడు(డిసెంబర్29)న లో పాయింట్ నుంచి హై పాయింట్ దరిదాపుల్లోకి రికవరీ జరిగింది. ముఖ్యంగా పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ షేర్లు రాణించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223.60 పాయింట్లు లేక 0.37 శాతం పెరిగి 61133.88 ముగిసింది. నిఫ్టీ 68.50 పాయింట్లు లేక 0.38 శాతం పెరిగి 18191 వద్ద ముగిసింది.బిఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 రోజువారీ అత్యల్ప స్థాయి పాయింట్లు 60479.06, 17992.80ని తాకాయి. ప్రపంచ మార్కెట్లు పేలవంగా ఉండడంతో మన దేశీయ మార్కెట్లు కూడా నెగటివ్‌గా మొదలయ్యాయి. చాలాసేపు నెగటివ్ టెరిటరీలోనే కదిలాయి. కానీ చివరి గంటలో ఇంట్రాడే లాసెస్‌ను తుడిచేసి పుంజుకున్నాయి. చివరి పాజిటివ్‌గా ముగిశాయి. నిఫ్టీలో ప్రధానంగా ఐషెర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బిఐ, టాటా స్టీల్ లాభపడగా, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి విలువను పోల్చినప్పుడు 0.07 పైసలు లేక 0.08 శాతం నష్టపోయి రూ. 82.81 వద్ద క్లోజయింది. మేలిమి బంగారం 10 గ్రాములు రూ.24.00 లేక 0.04 శాతం పెరిగి రూ. 54785.00 వద్ద ట్రేడయింది.
ఈక్విటీ మార్కెట్‌లో స్మార్ట్ రికవరీ!
- Advertisement -
- Advertisement -
- Advertisement -