- Advertisement -
నిజాంసాగర్ మండలంలోని ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై గురువారం మినీ వ్యాన్, కారు ఢీ కొన్న సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, మినీ వ్యాను బోల్తా పడటంతో కారులో ఉన్న సామాగ్రిని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పక్కకు తొలగించారు. కాగా, విషయం తెలుసుకున్న రాజయ్య యువ సేన సభ్యులు అవసరమైన సహాయ, సహకారాలు అందించారు. సామాగ్రి తొలగింపులో సహాయ పడటంతో పాటు, క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.
- Advertisement -