- Advertisement -
ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. సొంత గడ్డపై శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. కొంత కాలంగా గాయంతో జట్టుకు దూరంగా ఉన్న శర్మ త్వరలోనే జట్టులో చేరనున్నాడు. దీని కోసం రోహిత్ సాధన మొదలు పెట్టాడు. ఇటీవల కాలంలో రోహిత్ తరచు గాయాల బారిన పడుతున్నాడు. ఇక అతని కెప్టెన్సీలో భారత్ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేక పోతోంది.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగనుండడం, త్వరలోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో సిరీస్ ఉండడంతో అందరి దృష్టి రోహిత్‌పై పడింది. ఇక రోహిత్ కూడా పూర్వవైభవం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. దీని కోసం ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాడు. ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.
- Advertisement -