Monday, December 23, 2024

చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌ను ప్రారంభించిన అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌

- Advertisement -
- Advertisement -

అపోలో హాస్పిటల్స్‌ యొక్క సీఎస్‌ఆర్‌ కార్యక్రమం అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌, ఒక రోజు పాటు చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో నేడు నిర్వహించింది. అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌ మరియు రెకిట్స్‌ డెటాల్‌ నడుమ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య రక్షక్‌ ప్రోగ్రామ్‌ కింద నిర్వహించారు.

చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌ కార్యక్రమ నిర్వహణ ప్రధాన లక్ష్యం చిన్నారులు మరియు ఉపాధ్యాయుల నడుమ ప్రవర్తన పరంగా మార్పులను తీసుకురావడంతో పాటుగా పరిశుభ్రత మరియు శానిటేషన్‌ పరంగా ఉన్నత ప్రమాణాలను స్వీకరించడాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం పిల్లలను , వారి కమ్యూనిటీలలో ఆరోగ్యం మరియు పరిశుభ్రత యొక్క అంబాసిడర్‌లుగా మార్చే దిశగా నడిపించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ఆరోగ్య రక్షక్‌ కార్యక్రమానికి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. స్వల్పకాలిక లక్ష్యాలలో పరిశుభ్రత సంబంధిత కారణాల చేత కలిగే వ్యాధుల ప్రభావం తగ్గించడం; దీర్ఘకాలిక లక్ష్యాలలో ఆరోగ్యం మరియు పరిశుభ్రత నడుమ సంబంధం అర్ధం చేసుకుని, వ్యక్తిగతంగా, ఇల్లు మరియు కమ్యూనిటీ స్ధాయిలో వాటిని ఆచరించ కలిగిన సమాజం నిర్మించడం. ఈ సమాజం నీరు మరియు పరిశుభ్రతకు ప్రాధాన్యతనందిస్తుంది.

మొత్తంమ్మీద 600 మంది విద్యార్ధులు, 60 మంది ఉపాధ్యాయులు 60 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి పాల్గొన్నారు. చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా విద్యార్ధులు పాలుపంచుకోవడంతో పాటుగా గ్రూప్‌, సోలో సాంగ్స్‌, డ్యాన్స్‌లు కూడా చేశారు. ఈ కార్యక్రమం బహుమతులు, సర్టిఫికెట్ల ప్రధానంతో ముగిసింది.

అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌ను డెటాల్‌ తో భాగస్వామ్యం చేసుకుని రెకిట్‌ యొక్క ఆరోగ్య రక్షక్‌ ప్రోగ్రామ్‌ కింద నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 100 ప్రభుత్వ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించగా, ఇప్పుడు దానిని 500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించనున్నారు. ఇటీవలనే , టోటల్‌ హెల్త్‌ , రెకిట్‌తో భాగస్వామ్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని అరగొండ వద్ద మొదటి హైజీన్‌ పార్క్‌ ప్రారంభించింది.

అపోలో ఫౌండేషన్‌ గురించి..

తమ సామాజిక కార్యక్రమాలు మరియు భాగస్వామ్యాల ద్వారా ఆరోగ్యవంతమైన మానవాళిని రూపొందించడానికి అపోలో ఫౌండేషన్‌ ప్రయత్నిస్తుంది. 1983లో అపోలో హాస్పిటల్స్‌ ప్రారంభించిన నాటి నుంచి ఆరోగ్య ఈక్విటీ యొక్క దీని విలువలు స్థిరంగా ఉన్నాయి. అదే సంవత్సరం దీని దాతృత్వ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. నేడు, అపోలో ఫౌండేషన్‌ పట్టణ, గ్రామీణ భారత దేశాలలో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వీటన్నిటిలోనూ కమ్యూనిటీ అత్యంత కీలకంగా ఉంటుంది.

టోటల్‌ హెల్త్‌ గురించి…

అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ లిమిటెడ్‌ యొక్క కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమం టోటల్‌ హెల్త్‌. ఈ ప్రతిరూప నమూనా మొత్తం గ్రామీణ సమాజం కోసం, గర్భం నుంచి సమాధి వరకూ ఆరోగ్యం, అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఫౌండర్‌–ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి యొక్క టోటల్‌ హెల్త్‌ సైకిల్‌ ఫిలాసఫీ ః పరీక్షించడం, నిర్ధారించడం, చికిత్స చేయడం, అవగాహన కల్పించడం, సాధికారితనందించడం ఆధారంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News