Sunday, January 12, 2025

ప్రియుడు మోసం.. మనస్థాపంతో యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ విల్లస్ లో ఈ నెల 26వ ఆత్మహత్య చేసుకున్న పూజిత అనే సివిల్స్ విద్యార్థిని కేసులో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ సిఐ శ్రీధర్ కుమార్ వెల్లడించారు. పూజిత ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే మనస్థాపానికి గురై అత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు పోలీసులు. పూజితతో సన్నిహితంగా ఉంటున్న డాక్టర్ మహమ్మద్ అలీ వివాహమై భార్య ఉండగానే తనను ఇష్టపడ్డాడని తెలియడంతో మనస్థాపానికి గురై అద్దె ఇంట్లోనే కిటికీకి చున్నితో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. దీంతో పూజిత మరణానికి కారకుడైన మహమ్మద్ అలీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇబ్రహీంపట్నంకు చెందిన పూజిత తండ్రి కృష్ణ నాలుగు నెలల క్రితం శంషాబాద్ రాయల్ విల్లాస్ కాలనీలోని గోవర్దన్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకుని సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతుంది. అయితే అమెతో సన్నిహితంగా ఉంటున్న డాక్టర్ మహమ్మద్ అలీ అమె వద్దకు వచ్చి వెళ్లే వాడు. దీంతో అమె తనను పెళ్లి చేసుకుంటాడనుకుని మరింత సన్నిహితం పెం చుకుంది. కానీ మహమ్మద్ అలీకి ముందే వివాహమై భార్య కూడా ఉంది. విషయం పూజితకు తెలిసింది. దీంతో అమె మనస్థాపానికి గురై అమె ఉంటున్న అద్దె ఇంట్లో కిటికీకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News