Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు…

- Advertisement -
- Advertisement -

రాంచీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని నర్సాన్ సరిహద్దు హమ్మద్ పూర్ జాల్ వద్ద క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పంత్ రూర్కీకి వస్తుండగా డివైడర్ ను ఆయన కారు ఢీకొట్టింది. రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడడంతో సాక్షమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పంత్ కారు దగ్ధమైంది. రిషబ్ తల, కాలుకు గాయలయ్యాయని, ప్లాస్టిక్ సర్జరీ చేశామని సాక్షమ్ ఆస్పత్రి చైర్మన్, వైద్యుడు సుశీల్ తెలిపారు. వీపు భాగం కాలిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్రిస్మస్ వేడుకల కోసం పంత్ దుబాయ్ వెళ్లి ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఢిల్లీ నుంచి సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News