Friday, November 22, 2024

ప్రకృతి పట్ల ప్రేమ అవతార్ సినిమా

- Advertisement -
- Advertisement -

 

సరైన కథ లేకుండా కేవలం గ్రాఫిక్స్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడవు. సరైన కథ, కథనం ఉంటే అందుకు మిగతా అంశాలు కూడా తోడైతే అటువంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయి. టైటానిక్, అవతార్ వంటి సినిమాలు ఈ విషయాన్నే మరోసారి రుజువు చేశాయి. ఇక కథలోకి వెళ్తే పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించాడు జేమ్స్ కామెరూన్. ఆ గ్రహం మీద ‘నావి’ అనే తెగ జీవిస్తుంటుంది. అక్కడ ఉండే సహజ వనరులపై మానవుల కన్నుపడుతుంది. అమెరికా సైన్యం అక్కడకు వెళ్లగా.. నావీ తెగ వారిని ఎదుర్కొంటుంది. దీంతో ఏలియన్‌ను పోలి ఉన్న నావీ తెగ మనుషులను తాము తయారు చేయాలనుకుంటారు.

నేటివ్స్ డిఎన్‌ఎతో మానవ డిఎన్‌ఎను జోడించి, రిమోట్ కంట్రోల్‌తో పని చేసే అవతార్‌లను రెడీ చేస్తారు. అలాంటి అవతార్‌లలో జేక్ సల్లీ (సామ్ వర్తింగ్‌టన్) ఒకరు. చంద్రగ్రహం పరిమాణంలో ఉండే పండోరా అనే గ్రహం మీద 2154 సంవత్సరంలో అమెరికా సైన్యం అడుగుపెడుతుంది. పండోరా గ్రహంపైన లభించే అమూల్యమైన సహజ వనరులను లూటీ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ గ్రహంపై ఉండే మానవ ఆకారాన్ని పోలిన ఏలియన్ జనాభాను నేవీ అంటారు. తమ గ్రహానికి సంబంధించిన వారెవరైనా సరే.. వారిని దారుణంగా మట్టుపెడుతారు. అలాంటి వారిని ఎదుర్కొనడానికి నేటివ్స్ డిఎన్‌ఎతో మానవ డిఎన్‌ఎ జోడించి సైనికులను రిమోట్ కంట్రోల్‌తో పని చేసే అవతార్ అనే ఆకారాన్ని సృష్టిస్తారు. అమెరికా సైన్యం నేవీలపై యుద్ధానికి పాల్పడుతుంది.

జేక్ తన సహచరులతో పండోర గ్రహానికి వెళ్లగా, ఆ గ్రహవాసుల దాడిలో ఆయన అనుచరులు అంతా పారిపోతారు. ఇక చావడం ఖాయం అనుకున్న సమయంలో జేక్‌ను నావీ తెగకు చెందిన నేత్రి అతన్ని రక్షిస్తుంది. నావీతెగ పెట్టిన ఓ పరీక్షలో విజయం సాధించి జేక్ వారిలో ఒక సభ్యునిగా చేరిపోతాడు. వారిలో ఒకడిగా ఉండేందుకు శిక్షణ తీసుకునే క్రమంలో జేక్ సల్లీ నేత్రీతో ప్రేమలో పడిపోతాడు. నావీ తెగ మంచితనం చూసి వారికి రక్షణగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. జేమ్స్ కామెరాన్ అల్లుకొన్న కథ తెరపైన అద్భుతంగా ఆవిష్కృతమైంది. మానవుడికి, ఏలియన్‌కు మధ్య నడిపించిన ప్రేమకథ ఆయన సృజనాత్మకతకు అద్దం పట్టింది. యుద్ధం, శాంతి అనే కాన్సెప్ట్‌తో కథను నడిపించిన తీరు బాగుంది. యుద్ధం, ప్రేమ కోసం క్రియేట్ చేసిన పండోరా ఒక అద్బుతమైన ప్రపంచంగా మారిందని చెప్పవచ్చు.

నావిగా మారిన జేక్ (శామ్ వర్తింగ్‌టన్), నావి యువరాణి నేయితిరి (జో సల్దానా) పెళ్లి చేసుకుని, పిల్లలతో సంతోషంగా పండోరా గ్రహం మీద జీవిస్తుంటారు. ‘అవతార్’ క్లైమాక్స్‌లో కల్నల్ మైల్స్ (స్టీఫెన్ లాంగ్) చనిపోయినట్టు చూపించారు. గుర్తుందా? ఇప్పుడు అతను నావిగా తిరిగి వస్తారు. జేక్ మీద పగతో అతడిని అంతం చేయాలని నావీలుగా మారిన కొంత మంది సైన్యంతో పండోరా గ్రహం మీద అడుగు పెడతాడు. కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం జేక్ అడవులు వదిలి దగ్గరలోని సముద్ర తీరానికి వెళతాడు.

అక్కడ మరో తెగ (రీఫ్) ఉంటుంది. ఆ తెగ నాయకురాలు రొనాల్ (కేట్ విన్స్‌లెట్), ఆమె భర్త టోనోవరి (క్లిప్ కర్టిస్) ఎలాంటి సాయం చేశారు? జేక్‌ను చంపాలనే కల్నల్ లక్ష్యం నెరవేరిందా? లేదా? ఫ్యామిలీ కోసం ఆయన ఏం చేశారు? కథలో భారీ చేప పాత్ర ఏంటనేది తెరపై చూడాలి. ఈ సినిమా పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏలియన్స్ వాడిన ఆయుధాల ప్రకారం వారు భూగోళ వాసుల కంటే సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబడినవారేననే విషయం అర్ధమవుతుంది. సామ్రాజ్యవాదులే అవతార్ ముసుగులో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారనే కోణంలో విశ్లేషణ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ సందేశం అంతర్లీనంగా ఉందనే భావన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా అవతార్ 2 లో పెద్దగా ట్విస్టులు లేవు. అయితే సముద్ర దృశ్యాలు ఆకట్టుకుంటాయి. నిడివి కొంచెం తగ్గితే బావుండేది. మొత్తం మీద పిల్లలతో సరదాగా అవతార్ 2 చూసేయొచ్చు.

* యం.రాం ప్రదీప్
9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News