Thursday, November 14, 2024

లోకాయుక్త బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర!

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లు 2022ని ఆమోదించింది. ఇక దీంతో ముఖ్యమంత్రి, మంత్రి మండలిలోని వారంతా ఈ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ కిందికి వస్తారు. ఈ బిల్లును ఎలాంటి చర్చ జరపకుండానే ఆమోదించారు. కాగా ప్రతిపక్షాలు టీచర్స్ ఎంట్రెన్స్ టెస్ట్ కుంభకోణంపై వాకౌట్ చేశాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ బిల్లును చారిత్రాత్మక శాసనంగా శ్లాఘించారు. క్యాబినెట్ మంత్రి దీపక్ కేసర్కర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ యాంటీ కరప్షన్ అంబుడ్స్‌మన్ పరిధిలోకి ఇక ముఖ్యమంత్రి, క్యాబినెట్ వస్తారు.

ఈ బిల్లు ప్రకారం ముఖ్యమంత్రిపై ఏదేని విచారణ జరిపేందుకు లోకాయుక్త ముందు అసెంబ్లీ ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. దీని ప్రకారం మహారాష్ట్ర అసెంబ్లీలో మూడింట రెండువంతుల మంది శాసన సభ్యులు దీనికి ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది.
అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రిపై లోకాయుక్త ఎలాంటి దర్యాప్తు చేయడానికి వీలులేదు. ఒకవేళ విచారణ చేపట్టినా అది రహస్యంగానే ఉంచాలి. ఒకవేళ ఫిర్యాదును కొట్టివేయాలన్న నిర్ణయానికి వస్తే ఆ విచారణ రికార్డులను ఎక్కడా కూడా ప్రచురించకూడదు. ఎవరికీ అందుబాటులో ఉంచకూడదు.

లోకాయుక్త ప్రావిజన్ ప్రకారం లోకాయుక్త చైర్‌పర్సన్‌గా ఉంటారు. అతడు హైకోర్టు ప్రస్తుత లేక మాజీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నవాడై ఉండాలి. అంతేకాక సుప్రీంకోర్టు జడ్జీ లేక బాంబే హైకోర్టు జడ్జీ కూడా ఉంటారు. లోకాయుక్తలో గరిష్ఠంగా నలుగురు సభ్యులు ఉంటారు. వారిలో ఇద్దరు న్యాయవ్యవస్థ నుంచి ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News