Friday, November 15, 2024

అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు.. రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల ఆందోళనలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజ ప్రతినిధి, ఓయూ విద్యార్థి బైరి నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నిర్మల్‌లో అయ్యప్పస్వాములు నిరసనకు దిగారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బైరి నరేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హైదరాబాద్ జగద్గిరిగుట్టలోనూ అయ్యప్పస్వాములు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. హైదరాబాద్‌బీజాపూర్ జాతీయ రహదారిపై అయ్యప్ప భక్తులు ధర్నా చేపట్టారు. చేవెళ్ల, మొయినాబాద్‌లో రోడ్డుపై నిరసనతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై పిడి యాక్ట్ పెట్టి అరెస్టు చేయాలని గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఓ మతంపై మాట్లాడితే తనపై కేసు నమోదు చేశారని, అలాగే నరేశ్‌పైనా పిడి యాక్టు పెట్టాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News