Saturday, November 9, 2024

పాట.. మానవ సంబంధాలకు వారధి : గొరేటి వెంకన్న

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : పాట మానవ సంబంధాలను మరింత దగ్గర చేస్తూందని కవి, గాయకుడు ఎమ్మెల్సీ గొరేటి వెంకన్న అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో శుక్రవారం పాట.. -మానవ సంబంధాలపై ప్రభావం, ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన ఎమ్మెల్సీ గొరేటి వెంకన్న మాట్లాడుతూ మనుషుల జీవితమే.. పాటన్నారు. పాట లేకుంటే తానులేనని వెంకన్న స్పష్టం చేశారు. గాయకుడు మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. పాట ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. ఒక ప్రభుత్వన్ని నిట్టనిలువుగా చీల్చింది పాట. పాలక వర్గాలను హెచ్చరిక చేస్తూంది. నాటి చంద్రబాబు నాయుడును ప్రశ్నించింది. పాట తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించింది. పాటతో -మానవ సంబంధాలు వెలకట్టలేనిది.

నన్ను ఉత్తేజితం చేసింది. పల్లె కన్నీరు పెడుతోందో…అని పాట పాడి ఆయన వినిపించారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. పాట నక్సల్బరీ ఉద్యమాన్ని నడిపించింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. ఉద్యమాలను పుట్టించేదే పాట అన్నారు. పాట లేకుండా మనుషుల మద్య అనుబంధం ఏర్పాడదు. శ్రమ,అమరత్వం మీద అనేక పాటలు మనలను ప్రభావితం చేస్తోందన్నారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, అభినయ శ్రీనివాస్,కోదారి శ్రీనివాస,గిద్దె రామ నరసయ్య, దయా నర్సింగ్, బోడ చంద్రప్రకాష్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News