Saturday, December 21, 2024

టిడిపితో బిజెపికి పొత్తు ఉండదు: బండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో బిజెపికి పొత్తు ఉండబోదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన టిడిపి సభ తరువాత ఆ పార్టీతో బిజెపి పొత్తు ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బిజెపి క్యాడర్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. టిడిపితో పొత్తు ఉంటుందా? ఉండదా? అని తమ నేతలను బిజెపి కార్యకర్తలు నిలదీస్తున్నారు.

తాజాగా శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో నేరుగా బిజెపి చీఫ్ బండి సంజయన్‌ను కొందరు నేతలు ప్రశ్నించారు. మాజీ ఎంపీ విజయశాంతి నేరుగా దీనిపై బండి సంజయ్‌ను నిలదీశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి పొత్తు పెట్టుకోవడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని విజయశాంతి అన్నారు. ఇప్పుడు టిడిపితో పొత్తు అంటే బిజెపి శ్రేణుల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆమె ప్రశ్నలు వర్షం కురిపించారు. ఈ విషయంలో కలుగుజేసుకున్న ఎంపి అరవింద్ క్లారిటీ ఇవ్వడం మంచిదని సూచించడంతో బండి సంజయ్ స్పందించారు. టిడిపితో బిజెపికి పొత్తు ఉండదనే విషయాన్ని కార్యకర్తల దృష్టికి తీసుకెళ్ళాలని నాయకులకు బండి సంజయ్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News