Friday, December 20, 2024

పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. ఫేస్ బుక్ లైవ్ లో యువకుడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువతి పెళ్లికి నిరాకరించిందని సోషల్ మీడియా లైవ్(ఫేస్ బుక్) లో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని కలాయిన్ కు చెందిన జయదీప్ మెడికల్ సేల్స్ ప్రొఫెషనల్ గా పని చేస్తున్నాడు. సిల్చార్ లో అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ లో.. నేను ఆమెను ఎంతగానో ప్రేమించా, ఇదే విషయాన్ని చెప్పి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాను. కానీ అందరిముందు నన్ను తిరస్కరించింది.

మీ ఇద్దరి మధ్య సంబంధం కొనసాగితే ఆమెను చంపేస్తామని యువతి కుటుంబ సభ్యుల్లో ఒకరు బెదిరింపులకు పాల్పడ్డారు. అందుకే చనిపోతున్నా.. నావల్ల ఆమె బాధపడకూడదు. అమ్మా నన్ను మన్నించు, అంకుల్, ఆంటీ, అక్క, తమ్ముడు, బావ మీ అందరినీ ఎంతగానో ప్రేమించాను, కానీ నా ప్రియురాలిని అంతకు మించి ప్రేమించాను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. అందుకే ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నా అంటూ ఆత్మహత్యకు ముందు లైవ్ వీడియోలో జయదీప్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జయదీప్ మరణంతో కుటుంబం షాక్ కు గురైంది. బాధిత యువకుడి కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసు అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News