Saturday, December 21, 2024

ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. వైద్యం వికటించి ఐదేళ్ల బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మైలార్దేవి పల్లిలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం వికటించి సాన్విక అనే ఐదేళ్ల బాలిక మృతి చెందింది. ఆపరేషన్ కోసం మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికి పాప మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు.

దవాఖానా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అర్ధరాత్రి నుండి ఆస్పత్రి ఎదుట కొనసాగుతున్న కుటుంబ సభ్యుల ఆందోళన. పత్తాలేని ఆసుపత్రి వర్గాలు. స్పందించని యజమాన్యం. కోపంతో రగిలిపోతున్న సాన్విక కుటుంబ సభ్యులు. సాన్వికను పొట్టన పెట్టుకున్న వైద్యులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News