న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలో(2023) 5జి నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించేందుకు టెలికాం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సేవలను ప్రజలకు తక్కువ రేటుకే అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం టెలికాం రంగం మార్పులు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. టెలికామ్ రంగం 2022లో కొత్త అధ్యాయం మొదలుపెట్టింది.
అదే సమయంలో అదానీ గ్రూప్ కూడా టెలికాంలో పూర్తి స్థాయి వ్యాపారం దిశగా అడుగులు వేస్తోంది. 2023 డిసెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా 5జి నెట్‌వర్క్ ప్రారంభించేందుకు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ నిర్ణయించారు. టెలికాం కార్యదర్శి కె.రాజారమన్ మాట్లాడుతూ, అన్ని కేసులపైనా పనిచేస్తున్నామని, వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వశాఖలు, స్టార్టప్‌లకు చర్చలు జరుపుతున్నామని, అన్ని సమస్యలను పరిష్కరించేందు ప్రయత్నిస్తున్నామని అన్నారు. టెలికాం ఆపరేటర్ల ఖర్చును తగ్గించి, లాభాలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని అన్నారు.