- Advertisement -
సినీనటి, ఢీ డ్యాన్స్ షో జడ్జి ఫేమ్ పూర్ణ త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని నటి తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రకటించారు. ఈ నటి దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానీద్ ఆసిఫ్ అలీని అక్టోబర్ 24న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహ వేడుకలకు కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని గంటల క్రితం, నటి తన మనోహరమైన క్షణాలను వీడియో ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఆమె తన గర్భం గురించి ప్రకటించింది. త్వరలో తల్లి కాబోతున్నట్లు తెలిపింది. ఆమెకు కొడుకు పుట్టాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేశారు.
- Advertisement -