Monday, December 23, 2024

70లక్షలకు పెరిగిన రైతుబంధు లబ్ధిదారులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పధకం కింద లబ్ధిదారుల సంఖ్య 50లక్షల నుంచి 70లక్షలకు పెరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రి రైతుబంధు నిధలు జమ వివారాలను వెల్లడించారు.నాలుగో రోజు రైతుబంధు కింద రూ.575.09 కోట్లు 4,57,697 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేశామన్నారు. 11 లక్షల 50 వేల 191.09 ఎకరాలకు నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే ఎన్నికలలో దేశ రాజకీయాలపై తెలంగాణ ముద్ర బలంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికి అనుసరణీయం అన్నారు. రాష్ట్రంలో రైతుబంధు లబ్దిదారులు పెరుగుతుంటే దేశంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లబ్దిదారులు తగ్గుతున్నారన్నా రు.

11 కోట్లు ఉన్న లబ్దిదారులు 3 కోట్లకు పడిపోయారని, మూడేళ్ల లో 8కోట్ల మంది లబ్దిదారులను ఎగరగొట్టారన్నారు. 50 లక్షల మం ది ఉన్న రైతుబంధు లబ్దిదారులు 70 లక్షలకు పెరిగారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితం అన్నారు. వ్యవసాయరంగం, రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. 60 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయరంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News