Monday, December 23, 2024

హైదరాబాద్ మన కల్పతరువు

- Advertisement -
- Advertisement -

హైదరబాద్: తెలంగాణ రాష్ట్రం లో హైదరాబాద్ రూపు రేఖలే మారిపోయాయని , అందుకు సిఎం కెసిఆర్ దిశ నిర్దేశమే కారణమని రాష్ట్ర మునిసిపల్ పట్టణాభివృద్ధి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు.నూతన సంవత్సర కానుకగా కొత్త గూడ నుండి గచ్చిబౌలి వరకు 263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర విద్య శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్ర రెడ్డి, ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరీకే పూరి గాంధీ, ఎంపి రంజిత్ రెడ్డి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, శాసన మండలి సభ్యులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వాణి దేవి, జి హెచ్ ఏం సి కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ప్రాజెక్టు సి ఇ దేవానంద్,జోనల్ కమిషనర్ శంకరయ్య యస్ సి వెంకట రమణ, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్,సింధు, నాగేందర్ యాదవ్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. రానున్న ఏప్రిల్ వరకు సివరేజ్ పనులు పూర్తి అయితే దేశం లోనే వందకు వంద శాతం సివరెజ్ కలిగిన దేశంలో మొట్ట మొదటి నగరంగా హైదరాబాద్ నిలుస్తుందన్నారు.దేశంలో ఎక్కడ లేని మౌలిక వసతులు హైదరాబాద్ లో కల్పిస్తున్నట్లు హైదరాబాద్ కు విద్య, ఉపాధి కోసం పలు రాష్ట్రాల నుండి గాని పలు జిల్లాల నుండి వస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా కు అనుకున్న విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి అన్నారు. రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని నీటి సమస్య లేకుండా కెసిఆర్ చర్యలు తీసుకున్నారన్నారు.2022 జనవరి 1 న షేక్ పెట్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించడం జరిగినదని, 2023 జనవరి 1 న ప్రధాన ఫ్లై ఓవర్ తో పాటుగా ర్యాంపు నిర్మాణం అండర్ పాస్ తో మొత్తం 3.3 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ ను ప్రారంభించి నట్లు తెలిపారు.

యస్ఆర్ డిపి ద్వారా 47 పనులలో ఇప్పటి వరకు 34 పనులు పూర్తి అయ్యాయని, దీంతో నగరం లో 18 వ ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటు లోకి వచ్చినట్లు మంత్రి వెల్లడించారు.యస్ఆర్ డిపి ద్వారా 8 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టినట్లు మిగిలిన 11 ప్రాజెక్టు లు 2023 చివరి వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.సివరెజ్ కోసం 31 యస్ టిపి లను 3885 కోట్ల వ్యయం చేపట్టినట్లు దీంతో 100 శాతం సినారేజ్ సమస్య తీరుతుందన్నారు.ప్రజా రవాణా మెరుగు కోసం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 70 కిలో మీటర్ల పొడవు గల ఎయిర్ పోర్ట్ మెట్రో కు శ్రీకారం చుట్టారు రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు అంతేకాకుండా నగరం లో 3 వేల ఎలక్ట్రికల్ మోటార్ వాహన లను ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి తెలిపినట్లు కెటిఆర్ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం లో అభివృద్ది,సంక్షేమం రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నట్లు మంత్రి కెటిఆర్ అన్నారు.

శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ అరికేపూరీ గాంధీ మాట్లాడుతూ నియోజక వర్గం లో యస్ఆర్ డిపి ద్వారా 10 ఫ్లై ఓవర్లు కు గానూ 9 పూర్తయ్యాయని అతి పెద్ద నియోజక వర్గం లో రోజు రోజుకి జనాభా పెరుగుతున్న నేపథ్యం లో వసతులు కల్పించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.సిఎం కెసిఆర్ త్రాగు నీటి సమస్య లేకుండా 18 రిజర్వ్యాయర్ లు చేపట్టినట్లు, ప్రతి వార్డులో 150 కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టినట్లు తెలిపారు.కరోనా సమయంలో పనులకు అంతరాయం లేకుండా పనులను చేపట్టారని, గత 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నదన్నారు.పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ చిగురంత ఆశ జగమంత వెలుగు అన్నట్లు గా భారత దేశం లోనే తెలంగాణ ఒక వెలుగు వెలుగుతున్నట్లు అన్నారు.
రోడ్ నెట్ వర్క్ పెరగడం మూలంగా అన్ని రంగంలో అభివృద్ది జరుగుతుందన్నారు.ఇప్పటి వరకి18 వ ఫ్లై ఓవర్ లు అందుబాటులోకి వచ్చినట్లు ఎంపి పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఎస్ ఫ్లై ఓవర్ కు సంబందించిన శిలా పలకన్ని ఆవిష్కరించగా ప్రాజెక్టు సిఇ దేవానందం, యస్ సి వెంకట రమణ చే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభింప చేశారు. ఫ్లై ఓవర్ కోసం భూసేకరణ సకాలం లో చేసిన డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, రవీందర్ టిపియస్ ను రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News