Friday, December 20, 2024

యాదాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజలు

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి : యాదాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రధమంగా ఉత్తర ద్వార ద్వారా భక్తకోటికి దర్శనం ఇచ్చిన శ్రీ లక్ష్మీనరసింహుడు శ్రీ లక్ష్మీ నరసింహ వైకుంఠ 6:48 గంటల నుండి దర్శనాన్ని కల్పించగా అశేష భక్తజనులు స్వామివారిని దర్శించి తరించారు. ఆలయ అర్చకులు శాస్త్రంగా పూజలను నిర్వహిస్తూ వైకుంఠ ఏకాదశి పర్వదినం విశిష్టతను భక్తకోటికి తెలియజేశారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మేళతాళాల మధ్య వేదమంత్రాలను ఉచ్చరిస్తూ ఆలయపురి వీధులలో ఊరేగించారు.


శ్రీవారి వైకుంఠ ఏకాదశి పూజ మహోత్సవ వేడుకలలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సీఎంఓ భూపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, వై టి డి ఏ వైస్ చైర్మన్ కిషన్ రావు వంశిక ధర్మకర్త నరసింహమూర్తి,ఆలయవ ఆలయ ఈవో గీత ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులు ప్రముఖులు శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. శ్రీ పాత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి దర్శనం యాదాద్రి అనుబంధ ఆలయం ఏమైనా శ్రీ పాత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

రామలింగేశ్వరుడికి అభిషేక ప్రజలు వైకుంఠ ఏకాదశి పర్వదినంతోపాటు శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో కొండపైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి అభిషేక పూజలు రుద్ర హోమ పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి దర్శనం అనంతరం ఆలయపురి వీధిలో ఊరేగుతున్న శ్రీ లక్ష్మీనరసింహుడుని భక్తులు దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News