తిరుమల: నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా కలియుగ ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని సోమవారం తెల్లవారుజామున రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే యావత్ దేశం సుభిక్షంగా వర్థిల్లాలని వారు భగవంతున్ని వేడుకున్ననని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు ఉన్నాయని, వారి కరుణా కటాక్షాలతో రాష్ట్రానికి, దేశ ప్రజలందరికి మరెన్నో మంచి పనులు చేస్తారని రవిచంద్ర చెప్పారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల తిరుపతిలో కొలువై వున్న కలియుగ ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, అదృష్టంగా భావిస్తున్నానని ఎంపి వద్దిరాజు వివరించారు.