Monday, December 23, 2024

పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులు సురక్షితం

- Advertisement -
- Advertisement -

 

జైపుర్: బాంద్రా టెర్మినస్ నుంచి జోధ్‌పూర్ వెళుతున్న సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం తెల్లవారుజాము 3.27 గంటలకు జోధ్‌పూర్ డివిజన్‌లోని రాజ్‌కియావస్, బొమద్రా సెక్షన్ మధ్య పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేదీ సంభవించలేదని వాయువ్య రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.

సహాయ చర్యల నిమిత్తం రిలీఫ్ ట్రెయిన్‌ను జోధ్‌పూర్ నుంచి పంపినట్లు ఆయన చెప్పారు. మాల్వర్ జంక్షన్ నుంచి బయల్దేరిన ఐదు నిమిషాల్లోపలే రైలు బోగీలు కంపించడం ప్రారంభమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొద్ది నిమిషాల్లోనే రైలు నిలిచిపోయిందని, కిందకు దిగి చూస్తే కనీసం 8 స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పి కనిపించాయని వారు చెప్పారు. మరో 15 నుంచి 20 నిమిషాల్లో అంబులెన్సులు అక్కడకు చేరుకున్నాయని వారు తెలిపారు. జైపూర్‌లోని కంట్రోల్ రూము నుంచి పరిస్థితిని ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారని వాయువ్య రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News