Friday, December 20, 2024

నిందితులకు మూడు రోజుల పోలీస్‌ కస్టడీ

- Advertisement -
- Advertisement -

 

ఖంజావాలాలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి, ఆమె మరణానికి కారణమైన నిందితులకు రోహిణి కోర్టు మూడు రోజుల పోలీస్‌ రిమాండ్‌ విధించింది. కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఢిల్లీలోని రోహిణి కోర్టులో హాజరుపర్చారు. ఘటనపై ప్రజలంతా ఆగ్రహంతో ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితులను కోర్టుకు తీసుకెళ్లారు. మూసి ఉంచిన కోర్టు హాల్లో వాళ్లని న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. నిందితులను ఇంటరాగేట్‌ చేయడానికి ఐదు రోజులు పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని కోరారు.
దాంతో కోర్టు నిందితులు ఐదుగురికి మూడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. కోర్టు అనుమతితో పోలీసులు నిందితులు దీపక్‌ ఖన్నా, అమిత్‌ ఖన్నా, క్రిషన్‌, మిథున్‌, మనోజ్‌ మిట్టల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News