Friday, December 20, 2024

రేపు మహిళా శిశుసంక్షేమ శాఖ ఖాళీ పోస్టులకు పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఖాళీ పోస్టులకు రేపు జరిగే రాత పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత తెలిపారు. సోమవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని 230 మంది అభ్యర్థులు పరీక్షల హాజరుకానున్నట్లు తెలిపారు. ఈపరీక్షకు అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు నియమించినట్లు, కేంద్రాల్లో ఎలక్ట్రిసిటి, టాయిలెట్లు, త్రాగునీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాజరయ్యే అభ్యర్థులకు అంతరాయం కలగకుండా ఆర్టీసి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

పరీక్ష కేంద్రాలలోనికి ఉదయం సెషన్ వారిని 9.15 గంటలలోపు, మధ్యాహ్నం సెషన్‌వారిని 1.45 గంటల లోపు మాత్రమే అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించడం జరగదని తెలిపారు. హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూప్( ఆధార్,పాన్,ఓటర్ ఐడి,ప్రభుత్వ ఉద్యోగి ఐడి, డ్రైవింగ్ లైసెన్స్,పాస్‌పోర్టు) తమ వెంట తీసుకరావాలన్నారు. మొబైల్ పోన్లు, క్యాలికులెటర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పరీక్ష కేంద్రాలకు అనమతించరని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ లైజన్, ఆఫీసర్లు శైలజా, అన్వర్‌హుస్సేనీ, పోలీసు శాఖ కమిషనర్ ఆఫ్ పోలీసు బాబురావు, జీహెచ్‌ఎంసీ భాస్కర్, ఎలక్ట్రిసిటి సిజిఎం ప్రార్థన, ఆర్టిసికిషన్‌రావు,జలమండలి స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News