Monday, December 23, 2024

ఎపిలో 175 అసెంబ్లీ స్థానాల్లో బిఆర్‌ఎస్ పోటీ : మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం రాజకీయ అస్త్రంగా మారింది. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టం అనేక సార్లు స్పష్టం చేసింది. తమ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో పోలవరం పూర్తి కాలేదని, ప్రత్యేక హోదా సాధించలేదన్నారు.

అయితే రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. బిఆర్‌ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఎనిమిదేళ్ళలో తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. 2024లో ఆంద్రప్రదేశ్‌లో బిఆర్‌ఎస్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, విజయం జాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో బిఆర్‌ఎస్ విస్తరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News