ఖానాపూర్ ః ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్దికి ప్రభుత్వం రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎంఎల్ఎ అజ్మీరా రేఖ శ్యాంనాయక్ తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎంఎల్ఎ ఇంటి వద్ద స్థానిక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాల వలన వరదలతో నియోజకవర్గంలోని వాగులు, వంతెనలు ఉప్పొంగడంతో వరదలతో ఎంతో నష్టం జరిగిందని, వరదల వలన కొట్టుకుపోయినా వంతెనలను, రోడ్లను అధికారులచే సర్వేలు జరిపించి వాటి మరమ్మత్తుల కోసం నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించగా ఇరిగేషన్ గిరిజనశాఖ , పంచాయతీరాజ్‌శాఖ, ఆర్అండ్ బి శాఖల నుండి రూ. 70 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు.
వీటిలో కొన్ని పనులకు ప్రభుత్వం టెండర్లు పూర్థి చేయగా మరికొన్ని వాటికి త్వరలో టెండర్లు అధికారులు పూర్థి చేస్తారన్నారు. అలాగే పలు గ్రామాల్లో ఈ నిధులతో సీసీ రోడ్లు, బీటి రోడ్లు కాలువలు మరమ్మత్తులు , కొత్త వంతెన పనులు చేయడం జరుగుతుందన్నారు. తర్లపాడ్ వైపు బిటి రోడ్డు గాంధీ నగర్ వద్ద లింకొనువాగు పై కొత్త వంతెన నిర్మాణం,దిలావర్‌పూర్ వెళ్లే రింకొని వాగు పై కొత్త వంతెన నిర్మాణం , సదర్మాట్ వైపు వెళ్లే బీటు రోడ్డు నిర్మాణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మండలంలో అభివృద్ది పనులు చేయడం జరుగుతుందన్నారు.