Monday, December 23, 2024

20ఏళ్ల తర్వాత సొంతూరుకు జవాన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : 20ఏళ్లపాటు దేశ రక్షణ కోసం పనిచేసి, ఉద్యోగ విరమణ తర్వాత గ్రామంలోకి అడుగుపెట్టిన ఆర్మీ జవాన్‌ లక్క లింగారెడ్డికి ఘన స్వాగతం పలికారు నల్గొండ జిల్లా బట్టుగూడెం గ్రామస్తులు. భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. ఆర్మీలో చేరి 20ఏళ్లపాటు సొంతూరుకి, కుటుంబానికి దూరంగా ఉంటూ పనిచేయడం కత్తి మీద సవాలే అంన్నారు జవాన్‌ లింగారెడ్డి. ఎన్నో కష్టనష్టాలు ఉంటాయన్నారు.

అయితే, దేశానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టం అన్నారు. 20ఏళ్ల తర్వాత గ్రామంలోకి అడుగుపెట్టిన లింగారెడ్డికి చిన్నాపెద్దా అందరూ ఘనస్వాగతం పలికారు. దేశ భక్తి గీతాలకు డ్యాన్స్‌లు చేస్తూ జాతర మాదరిగా గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు, స్నేహితులు, ప్రజాప్రతి నిధులు తరలివచ్చి స్వాగతం పలకడంతో సంతోషంతొ ఉప్పొంగిపోయారు లింగారెడ్డి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News