Saturday, December 21, 2024

ప్రేమ వివాహం.. యువకుడి ఇల్లు దహనం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ప్రేమ వివాహం చేసుకున్నాడని అబ్బాయి ఇంటిని తగలబెట్టిన సంఘటన హుజురాబాద్ లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హుజురాబాద్ కు చెందిన రాజశేఖర్, సంజన గత కొన్ని రోజులుగా ప్రేమించికుంటున్నారు. ఇద్దరి ప్రేమ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసింది.ఇద్దరు కులాల ఒక్కటి అయినప్పటికీ అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకించలేదు. దీంతో ప్రేమజంట సోమవారం వేములవాడ వెళ్లి పెళ్లి చేసుకున్నారు. మంగళవారం తల్లిదండ్రుల నుండి హానీ ఉందని పెళ్లి జంట పోలీసులను ఆశ్రయించారు.

పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలియడంతో అమ్మాయి తరుపు బంధువులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇళ్ళు పూర్తిగా కాలిపోయింది. సుమారుగా..4 లక్ష ల వరకు ఆస్థి నష్టం కలిగినట్లు బాధితులు తెలిపారు.
అబ్బాయి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News