Monday, December 23, 2024

మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజిల్లో దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాలురు 1 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంపిసి, బిపిసి మొదటి సంవత్సరంలో చేరటానికి ఆసక్తి గల మైనారిటీ, క్రైస్తవ, జైన బుద్ద పర్సా, నాన్ మైనారిటీ ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్ ఆప్లికేషన్లు కోరుతున్నట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ ముబీన్ చెప్పారు. దానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం వైబ్‌సైట్‌లో లేదా కోటగిరిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలుర1)లో నేరుగా దరఖాస్తులు స్వీకరించబడును. అర్హత కలిగిన ఆసక్తి గల విద్యార్థులు జనవరి 15 నుంచి 30 జనవరి 2023లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం 9493040786, 9440622692 నెంబర్లను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News