Sunday, January 19, 2025

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

లింగాల : నాగర్‌ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రం సమీపంలోని మగ్గంపూర్ చౌరస్తా వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వివరాలలోకి వెళితే.. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న టిఎస్ 07 యుకె 1662 నెంబర్ గల బొలెరో ట్రాన్స్‌పోర్ట్ వాహనం, అచ్చంపేట నుంచి లింగాలకు వస్తున్న బైక్ మగ్దుంపూర్ చౌరస్తా వద్ద రెండు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న లింగాలకు చెందిన తోళ్ల అంజి, కేతావత్ దివాకర్, పోలమౌని ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో మెరుగైన వైద్య సేవల కోసం నాగర్‌ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News