కరీంనగర్: కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల (సిబిఎస్‌ఇ)లో విద్యార్థులు శారీరక సాహస విన్యాసాల కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మెన్ రుద్ర రాజు,పాఠశాల చైర్మెన్ ఫాతీమారెడ్డిలు బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు జిమ్నాస్టిక్స్,గొడుగులతో గోపురాలు,బల్లలపై గోపురాలు,గురపు నడక,గాలిలో బాలుని ఎగరవేయుట,పది మంది పడుకొని ర్యాంపుపై నుండి బైక్ తో దూకడం, బైక్ పై జాతీయ జెండాలతో పది మంది విద్యార్థులు ఉండి నడపడం,ర్యాంపుపై నుండి బైక్‌తో వస్తూ ట్యూబ్ లైట్స్‌ని పగలగొట్టిడం,30మంది విద్యార్థుల మంటలతో సరిగెత్తడం,ఇవే కాకుండా బైక్‌పైన రకరకాల విన్యాసాలు చూపరులను ఆశ్చర్యపరిచేట్లుగా విన్యాసాలు చేసారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ రుద్ర రాజు మాట్లాడుతూ.. అమ్మాయిలు బహు చక్కనైన డాన్స్‌తో అలరించారని, అబ్బాయిలు గుర్రపు స్వారీలతో చెలరేగిపోయారని ఎంతో సుశిక్షితులైన వీర జవాన్లు చేసే ఈ విన్యాసాలు సెయింట్ విద్యార్థులు బహుచక్కగా చేసారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మెన్ ఫాతీమారెడ్డి,ప్రిన్సిపల్ భార్గవ్,నిరంజన్,ఉపాకాంత్,వైస్ ప్రిన్సిపల్ మధు,కరాటే మాస్టర్ వేణుగోపాల్,డ్యాన్స్ సతీష్,పిఇటిలు జగన్,రజిత,సాయి,కిరణ్,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల శారీరక సాహస విన్యాసాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -